తెలంగాణ

telangana

ETV Bharat / sports

డారెన్​ సామికి పాక్​ పౌరసత్వం.. ఆ విషయమే కారణం

వెస్టిండీస్​ క్రికెటర్ డారెన్​ సామి త్వరలో పాక్​ గౌరవ పురస్కారం(నిషాన్-ఏ-పాకిస్థాన్​) అందుకోనున్నాడు. వచ్చే నెల 23న ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్​ అల్వీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నాడు. ప్రస్తుతం ఇతడు పాకిస్థాన్​ సూపర్​ లీగ్(పీఎస్​ఎల్​)​లో పెషావర్​ జాల్మీ తరఫున ఆడుతున్నాడు.

darren Sammy Nishan-e-Haider
'డారెన్​ సమీ'కి పాక్​ గౌరవ పురస్కారం.. మార్చి 23న అందజేత

By

Published : Feb 22, 2020, 5:56 PM IST

Updated : Mar 2, 2020, 5:03 AM IST

వెస్టిండీస్​ మాజీ కెప్టెన్​​ డారెన్ సామి.. పాకిస్థాన్​​ అత్యుత్తమ పౌర పురస్కారానికి ఎంపికయ్యాడు. వచ్చే నెల 23న 'నిషాన్-ఏ-పాకిస్థాన్'తో ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్​ అల్వి అతడిని గౌరవించనున్నారు. దీనితో పాటే ఆ దేశ గౌరవ పౌరసత్వాన్ని అతడికి కల్పించనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్​లో వెల్లడించింది. పాకిస్థాన్‌కు సామి అందిస్తోన్న క్రికెట్ సేవలకు ప్రతిఫలంగా దీనిని ఇస్తున్నట్లు పీసీబీ పేర్కొంది.

ఫ్రాంచైజీ యజమాని సిఫార్సుతోనే!

ప్రస్తుతం సామి... పాకిస్థాన్ సూపర్​ లీగ్‌(పీఎస్​ఎల్​)లోని పెషావర్ జాల్మీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీ యజమాని జావేద్ అఫ్రిది ఇటీవలే సామికి అత్యుత్తమ పౌర పురస్కారం ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు, పీసీబీ ఛైర్మన్‌ ఇషాన్​ను కోరాడు. దానికి వారు అంగీకరించడం విశేషం.

గతంలో ఇద్దరికి

ఈ గౌరవ పురస్కారం అందుకున్న మూడో ఆటగాడిగా సామి పేరు తెచ్చుకున్నాడు. ఇతడి కంటే ముందు ఆస్ట్రేలియా క్రికెటర్​ మాథ్యూ హేడెన్​, దక్షిణాఫ్రికా క్రికెటర్​ గిబ్స్​ ఈ అవార్డులు అందుకున్నారు.

Last Updated : Mar 2, 2020, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details