స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకపోతే క్రికెటర్లంతా ఆ అనుభూతిని మిస్ అవుతారని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరిగితే వారి నుంచి మనం పొందే అనుభూతిని కోల్పోతాం. కానీ, మనం రెండు నెలలుగా ఇంట్లో కూర్చున్నాం. అందువల్ల ఇది మనకు వచ్చిన అవకాశంగా భావించాలి. తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం".