తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ మార్గదర్శకాలే కీలకం : గైక్వాడ్ - We will be neutral, won't take anyone's opinion: Gaekwad on coach selection

టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియకు దరఖాస్తు గడువు ముగిసింది. క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ పదవికి మళ్లీ రవిశాస్త్రి అయితే బాగుంటుందని కోహ్లీ తెలిపాడు. ఈ విషయంపై సీఏసీ సభ్యుడు గైక్వాడ్ స్పందిస్తూ.. ఆ మాటల్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశాడు.

గైక్వాడ్

By

Published : Jul 31, 2019, 6:10 PM IST

ప్రపంచకప్​ వైఫల్యం తర్వాత కోచ్ ఎంపికకు సిద్ధమైంది బీసీసీఐ. మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు పలువురు ఆ పదని కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీమిండియా సారథి కోహ్లీ మాత్రం మళ్లీ రవిశాస్త్రి కోచ్​గా ఉంటేనే బాగుంటుందని తెలిపాడు. దీనిపై క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్ స్పందించాడు. విరాట్ వ్యాఖ్యాల్ని పరిగణలోకి తీసుకోమని అన్నాడు.

"మహిళా జట్టు కోచ్‌ను ఎంపిక చేసినప్పుడు మేం ఎవ్వరినీ సంప్రదించలేదు. ఈసారి అదే విధానాన్ని కొనసాగిస్తాం. కోహ్లీ ఏం చెప్పాడన్నది అనవసరం. ఆ మాటల్ని మేము పరిగణలోకి తీసుకోం. బీసీసీఐ మార్గదర్శకాలే మాకు కీలకం. ఓపెన్​ మైండ్​తో ఇంటర్వ్యూలు చేస్తాం. కపిల్​దేవ్, నేను ఇద్దరం కోచ్​గా పనిచేసిన వాళ్లమే. జట్టుకు ఏవి ప్రయోజనకరమో మాకు తెలుసు. కోచ్​ ఎంపికలో చాలా అంశాలు ఉన్నప్పటికీ ఆటగాళ్లను సమన్వయపర్చడం, ప్రణాళికలు రచించడం, సాంకేతికంగా అనుభవం కలిగి ఉండటం అనే లక్షణాలు ముఖ్యమైనవి. ఇవి ఉన్నవారే కోచ్​గా రాణిస్తారు".
-అన్షుమన్ గైక్వాడ్, క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు

ఇప్పటికే కోచ్​ పదవికి దరఖాస్తు గడువు ముగిసింది. ఇంటర్వ్యూ ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. క్రికెట్​ సలహా కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ కమిటీలో కపిల్​దేవ్​, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఉన్నారు.

ఇవీ చూడండి.. జోఫ్రా జోస్యం మళ్లీ నిజమైంది..!

ABOUT THE AUTHOR

...view details