తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో మా జట్టును చూసి భయపడాల్సిందే' - assistant coach Paul Collingwood

వచ్చే పొట్టి ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ను చూసి చాలా జట్లు భయపడతాయని ఆ జట్టు సహాయ కోచ్​ పాల్ కాలింగ్​ వుడ్​ తెలిపాడు. వరల్డ్​కప్ కోసం తమ జట్టు చాలా బాగా సన్నద్ధమైందని వెల్లడించాడు.

We will be feared by a lot of teams in T20 World Cup: Collingwood
'టీ20 ప్రపంచకప్​లో మా జట్టును చూసి భయపడాల్సిందే'

By

Published : Mar 19, 2021, 10:57 PM IST

రానున్న టీ20 ప్రపంచకప్​లో తమ జట్టును చూసి చాలా జట్లు భయపడతాయని తెలిపాడు ఇంగ్లాండ్ సహాయ కోచ్​ పాల్​ కాలింగ్​ వుడ్. ఈ సారి తమ టీమ్​ చాలా బాగా సన్నద్ధమైందని వెల్లడించాడు.

2010లో టీ20 వరల్డ్​కప్​ గెలిచిన ఇంగ్లాండ్​ జట్టుకు కాలింగ్​ వుడ్​ కెప్టెన్​గా వ్యవహరించాడు. మరో 7 నెలల్లో భారత్​ వేదికగా పొట్టి ప్రపంచకప్​ జరగనుందని గుర్తు చేశాడు.

"ఈ వరల్డ్​కప్​ను తీసుకుంటే.. మా టీమ్​ను చూసి చాలా జట్లు భయపడతాయి. నాలుగేళ్లుగా వైట్​ బాల్​ క్రికెట్​లో మా జట్టుకున్న ఫామ్​ను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని చెబుతున్నా. టీమ్​లోని 11 మందిలో చాలా మందికి జట్టును గెలిపించే సత్తా ఉంది. 2010తో పోలిస్తే ప్రస్తుత టీమ్​కు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పటి ఇంగ్లాండ్​ జట్టే బాగుంది."

-పాల్​ కాలింగ్​ వుడ్​, ఇంగ్లాండ్ సహాయ కోచ్.

పరిమిత ఓవర్ల క్రికెట్​లో తమ జట్టు ఆధిపత్యం చెలాయించడం గురించి స్పందించాడు కాలింగ్​ వుడ్. "నాలుగేళ్లుగా సాధిస్తున్న విజయాలే ఇందుకు తార్కాణమని పేర్కొన్నాడు. పెద్ద మ్యాచ్​లలో గెలిచినప్పుడే టీమ్​గా సత్తా తెలుస్తుంది. ఒత్తిడిలో మ్యాచ్​లు ఆడటం ప్రపంచకప్​కు ముందు చాలా అవసరం. శనివారం భారత్​తో జరిగే మ్యాచ్​ మాకు ఫైనల్​ లాంటిది" అని కాలింగ్ వుడ్ తెలిపాడు.

చివరి టీ20కి తయారు చేసిన వికెట్​ రెండో మ్యాచ్​ పిచ్​ లాగే ఉందని సహాయ కోచ్ పేర్కొన్నాడు. కొంచెం పేస్ కలిగి ఉందని వెల్లడించాడు. సాఫ్ట్​ సిగ్నల్​ వివాదంపై స్పందించిన పాల్​ కాలింగ్​ వుడ్​.. అంపైరింగ్​ మధ్యలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:ఏమయ్యా అంపైర్.. ఇదెలా ఔట్?

ABOUT THE AUTHOR

...view details