తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహల్ అసలు మా ప్లాన్​లోనే లేడు​: కోహ్లీ - విరాట్​ కోహ్లీ చాహల్​

తొలి టీ20 కోసం చాహల్​ను​ తుదిజట్టులో తీసుకోవాలనే ఆలోచనే లేదని కెప్టెన్​ కోహ్లీ చెప్పాడు. కీలక వికెట్లు పడగొట్టిన అతడు..​ మ్యాచ్​ గమనాన్నే మార్చేశాడని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్​లో 11 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది.

We had no plans to play Chahal, but concussion replacement worked for us: Kohli
జట్టులో చాహల్​ను తీసుకోవాలన్న ఆలోచనే లేదు: కోహ్లీ

By

Published : Dec 4, 2020, 8:29 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో చాహల్‌ను తీసుకోవాలనే ఆలోచనే లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. భారత్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే కంగారూ జట్టు పరిమితమైంది. చాహల్‌, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్‌ చేయడం వల్ల ఆసీస్‌ ఓటమి పాలైంది.

"ఈ మ్యాచ్​కు చాహల్​ను తీసుకోవాలనే ఆలోచనలే లేవు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విచిత్ర పరిస్థితి. ఈరోజు అది మాకు కలిసొచ్చింది. ఆసీస్‌ను చిత్తు చేయడంలో చాహల్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఫించ్‌, షార్ట్‌ బాగా ఆడడం వల్ల వాళ్లకు శుభారంభం దక్కిందని అనుకున్నా. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ కొన్ని వికెట్లు సమర్పించుకున్నారు. ఇక్కడ ఆడాలంటే చివరివరకు పోరాడి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి. నటరాజన్‌ మరింత మెరుగయ్యేలా కనిపిస్తున్నాడు. దీపక్​ చాహర్ బాగా బౌలింగ్‌ చేశాడు. చాహల్‌ మమ్మల్ని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. చివరగా హార్దిక్‌ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది"

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

ఈ మ్యాచ్‌లో తొలుత చాహల్‌ తుది జట్టులో లేడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన రవీంద్ర జడేజా(44)కు చివరి ఓవర్‌లో అతడి హెల్మెట్​కు బంతి బలంగా తాకడం వల్ల కంకషన్​ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్ వచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసిన చాహల్‌.. ఫించ్‌(35), స్మిత్‌(12), మాథ్యూవేడ్‌(7) లాంటి కీలక బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేశాడు.

కాన్​బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(51), రవీంద్ర జడేజా(44‌) ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి:హీరోకు కరోనా.. ఆగిన సినిమా షూటింగ్​

ABOUT THE AUTHOR

...view details