తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​పై టెస్టుల్లో గెలిస్తే ఆ మజానే వేరు: గంగూలీ

న్యూజిలాండ్​ పర్యటనలో ఉన్న భారత్..టెస్టుల్లో గెలిస్తే చూడాలని ఉందన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఎందులో గెలిచినా, ఈ ఫార్మాట్​లో గెలిస్తే ఆ మజానే వేరని చెప్పాడు.

కివీస్​పై టెస్టుల్లో గెలిస్తే ఆ మజానే వేరు: గంగూలీ
టీమిండియా-గంగూలీ

By

Published : Jan 26, 2020, 12:36 PM IST

Updated : Feb 25, 2020, 4:16 PM IST

ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉంది టీమిండియా. ఆక్లాండ్​లో తొలి టీ20 గెలిచి, రెండో మ్యాచ్​లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని భావిస్తోంది. కివీస్ గడ్డపై భారత్​కు వన్డేలు, టెస్టుల్లో గెలుపు శాతం ఏమంత ఆశాజనకంగా లేదు. అయితే ఈ సారి మాత్రం కివీస్​పై మనోళ్లు.. టెస్టు సిరీస్​ గెలిస్తే చూడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు.

"మేం గతసారి కివీస్​ పర్యటనకు వచ్చినపుడు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు 4-1 తేడాతో వన్డే సిరీస్​ గెల్చుకున్నాం. ప్రస్తుత జట్టు.. న్యూజిలాండ్​పై టెస్టు సిరీస్​ గెలిస్తే చూడాలని అనుకుంటున్నా. ప్రతి సిరీస్​ సమానమే కానీ ఈ ఫార్మాట్​లో వారిపై గెలిస్తే ఆ మజానే వేరు. కోహ్లీసేన ఇప్పుడు మంచి ఫామ్​లో ఉంది. మేం భారత జట్టులోని సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఒత్తిడి తీసుకోకుండా ఆడమని కోహ్లీకి చెప్పాం" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఇప్పటివరకు 9 సార్లు కివీస్​ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. కేవలం రెండుసార్లు(1967-68, 2008-09) మాత్రమే టెస్టు సిరీస్​లో విజయం సాధించింది. రెండు సార్లు సిరీస్​ డ్రాగా ముగిసింది. ఆతిథ్య జట్టు ఐదుసార్లు జయకేతనం ఎగురవేసింది.

ప్రస్తుతం పర్యటనలో న్యూజిలాండ్​తో ఐదు టీ20లతో పాటు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా.

Last Updated : Feb 25, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details