ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో సత్తాచాటాడు. ప్రస్తుతం రెండో టెస్టులో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు.
రెండో టెస్టులో తొలుత ఇంగ్లాండ్.. 258 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. స్మిత్ మరోసారి ఇంగ్లీష్ బౌలర్లను ఓర్పుతో ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఆడిన డిఫెన్స్‌పై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఛలోక్తులు విసురుతున్నారు. బంతుల్ని వదిలేస్తూ క్రీజులో అతడు కదులుతున్న తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.