తెలంగాణ

telangana

ETV Bharat / sports

అశ్విన్ ప్రశ్నకు నట్టు సమాధానం.. నవ్వులే నవ్వులు - natarajan

టీమ్​ఇండియా క్రికెటర్లు సుందర్, శార్దుల్, నటరాజన్​లను ఇంటర్వ్యూ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. నట్టునూ అడిగిన ఓ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానానికి వీరందరూ పగలబడి నవ్వారు.

Watch: Natarajan's response leaves Ashwin and Sundar in splits
ఆ ప్రశ్నకు నట్టు సమాధానం.. నవ్వులే నవ్వులు

By

Published : Jan 18, 2021, 5:01 AM IST

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మూడో రోజు ఆట తర్వాత గబ్బా మైదానంలో ఆసక్తికర ఇంటర్వ్యూ జరిగింది. టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​ హీరోలు శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, టి. నటరాజన్​లను సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. అతడు అడిగిన ఓ ప్రశ్నకు నట్టు చెప్పిన సమాధానానికి అందరూ గట్టిగా నవ్వారు.

ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో గత 10 ఇన్నింగ్స్​లో ఒక్క పరుగు కూడా చేయలేదు, ఎట్టకేలకు ఖాతా తెరిచి నాటౌట్​గా నిలవడం ఎలా ఉందని నటరాజన్​ను అశ్విన్ అడిగాడు. దానికి నవ్వుతూ బదులిచ్చాడు నట్టు. అలానే ఈ మ్యాచ్​లో స్టార్క్​ వేసిన ఓవర్ మొత్తం ఆడినట్లు చెప్పాడు.​ మరి స్టార్క్​ను ఎదుర్కోవడం సులువుగా ఉన్నట్లుందే అని అడిగినప్పుడు.. 'మొదటి బంతి అసలు కళ్లకే కనపడలేదన్నా' అని అశ్విన్​తో నవ్వుతూ అన్నాడు.

ఇదీ చూడండి:చూడకుండానే సిక్స్ కొట్టిన సుందర్

ABOUT THE AUTHOR

...view details