తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం తెలిసినప్పటి నుంచి భార్య అనుష్క శర్మ, తానూ చంద్రుడిపై తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నట్లు చెప్పాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఆ అందమైన అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అన్నాడు. తామిద్దరి ఆనందానికి అవధులు లేవని చెప్పిన విరాట్.. త్వరలోనే కుటుంబంలోకి రానున్న మూడో వ్యక్తి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
లాక్డౌన్తో చాలాకాలం ఇంటికే పరిమితమవడం వల్ల ప్రాక్టీస్టుకు వెళ్లేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినట్లు చెప్పాడు కోహ్లీ. అయినా తనలోని నైపుణ్యం ఏమీ కొరవడలేదని అన్నాడు. స్టేడియంలో అభిమానులు లేకుండా ఆడటం కొత్తగా ఉంటుందని వెల్లడించాడు. చివరిసారిగా 2010 రంజీ ట్రోఫీలో అలా ఆడానని గుర్తు చేసుకున్నాడు.