తెలంగాణ

telangana

ETV Bharat / sports

నికోలస్ స్టన్నింగ్ క్యాచ్​.. స్మిత్ పెవిలియన్​కు - న్యూజిలాండ్

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో కివీస్ ఆటగాడు హెన్రీ నికోలస్ అద్భుతమైన క్యాచ్​ పట్టి, ఆశ్చర్యపరిచాడు. స్టార్ బ్యాట్స్​మన్​ స్మిత్​ను పెవిలియన్​కు పంపాడు.

Henry Nicholls
నికోలస్

By

Published : Dec 27, 2019, 1:31 PM IST

మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో కివీస్ క్రికెటర్ హెన్రీ నికోలస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్​ ఆటకే హైలెట్​గా నిలిచింది. గాల్లోకి ఎగిరి ఒక్క చేత్తోనేబంతిని అందుకున్నాడు నికోలస్.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్​ 105వ ఓవర్​ నాలుగో బంతి. నీల్ వాగ్నర్ బౌలింగ్. షార్ట్​ పించ్​ బంతిని ఎలా ఆడాలో తికమకపడ్డ స్మిత్​ బ్యాట్​ను అడ్డుపెట్టాడు. అదికాస్తా ఎడ్జ్ తీసుకుంది. బంతి గాల్లోకి లేచింది. గల్లీలో ఉన్న నికోలస్​.. వెనక్కి వెళుతున్న బంతిని.. అమాంతరం ఎగిరి ఒంటిచేత్తో పట్టేశాడు. ఫలితంగా స్మిత్.. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​ చేరాడు.

శుక్రవారం.. ఓవర్‌నైట్‌ స్కోరు 257/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 467 పరుగుల వద్ద ఆలౌటైంది. హెడ్ (114) సెంచరీతో మెరవగా.. స్మిత్ (85), పైన్ (79), లబుషేన్ (63) అర్ధశతకాలతో రాణించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.

ఇవీ చూడండి.. మాలిక్​పై నెటిజన్ల ఆగ్రహం.. ట్రోల్స్ వర్షం

ABOUT THE AUTHOR

...view details