తెలంగాణ

telangana

ETV Bharat / sports

మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు : వార్నర్​ - undefined

ఈ సీజన్ ఐపీఎల్​లో సత్తాచాటి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాడు వార్నర్. ఈ సందర్భంగా అభిమానులకు ఓ సందేశాన్నిచ్చాడు.

వార్నర్

By

Published : Apr 30, 2019, 5:15 PM IST

ఐపీఎల్​ 12వ సీజన్​లో సత్తాచాటిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్ ప్రపంచకప్ దృష్ట్యా స్వదేశమైన ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో జట్టును గెలిపించి.. ప్లే ఆఫ్స్ రేసుకు మరింత దగ్గర చేశాడీ ఆసిస్ బ్యాట్స్​మెన్. వెళుతూ... వెళుతూ సన్​రైజర్స్ అభిమానులకు ఇన్​స్టాగ్రామ్​లో భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు.

"మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాదీ మీరు నాకు మద్దతుగా నిలిచారు. సన్‌రైజర్స్‌ కోసం ఆడటానికి చాలా ఎదురు చూశా. ఫ్రాంఛైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా విభాగం, అభిమానులు నా పునరాగమనానికి ఘనస్వాగతం పలికారు. మీతో ఆడడాన్ని ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో జట్టు విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా"

- డేవిడ్ వార్నర్, సన్​రైజర్స్ ఆటగాడు

పంజాబ్‌తోసోమవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ (56 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 692 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఇవీ చూడండి.. 'అమ్మా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details