టీ20 క్రికెట్లో భారత్‌కు రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్ కాగలడని.. ఆ ఫార్మాట్లో అతడికి ఎక్కువ అవకాశాలివ్వాలని మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ ఒత్తిడిలో రాణించడం, జట్టును గెలిపించడం చూశాం. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ప్రత్యర్థి కెప్టెన్ ఒత్తిడికి గురవుతాడు. భారత జట్టుకు అతడు గొప్ప ఆస్తి. ఒకట్రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రానా అతడిపై ఒక అంచనాకు రారనే ఆశిస్తున్నా. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే అతడికి చాలా సమయం ఇవ్వొచ్చు. జట్టులో చోటు ఖాయం అన్న నమ్మకం కలిగితే పంత్ సొంతంగా మ్యాచ్‌లు గెలిపించగలడు" అని లక్ష్మణ్ తెలిపాడు.