చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ వివో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి వైదొలగాలనుకుంటోంది. ఈ సంస్థకు 2023 వరకు టైటిల్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులు ఉన్నాయి. కానీ గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.
ఐపీఎల్ నుంచి వివో పూర్తిగా.. కారణమిదే! - vivo
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనా మొబైల్ దిగ్గజం వివో వైదొలగనుంది. ఇప్పటికే 2020కి గాను బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఈ సంస్థ.. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్ హక్కులు బదిలీ చేయాలని భావిస్తోంది.
ఐపీఎల్ నుంచి పూర్తిగా దూరం కానున్న వివో!
ఇప్పుడు వివో ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కావాలనుకుంటోంది. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్ హక్కులను బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ స్పాన్సర్షిప్ హక్కుల కోసం డ్రీమ్11, అన్అకాడమీ వంటి కంపెనీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్11 రూ.222 కోట్లు చెల్లించి 2020 ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి:'లాక్డౌన్లో రూల్స్ మార్చారు.. మా చేతుల్లో ఏముంది?'