బంగ్లాదేశ్ పర్యటన అనంతరం లభించిన విరామ సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్వాదిస్తున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి సినిమాకు వెళ్లాడు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఇటీవలే భూటాన్ పర్యటనలో కోహ్లీ, అనుష్కతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేశాడు.