తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పింక్'​పై ఫోకస్ ఎక్కువ పెట్టాలి: కోహ్లీ

రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా బంగ్లాదేశ్​తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మీడియాతో మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Nov 13, 2019, 2:09 PM IST

విరాట్ కోహ్లీ

బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్​ కోసం జట్టుతో కలిశాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం ఇండోర్ స్టేడియంలో సాధన చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఎరుపు బంతితో పోలిస్తే గులాబి బంతి స్వింగ్​ ఎక్కువగా అవుతుందని అన్నాడు.

"పింక్ బంతితో ఆట.. టెస్టు క్రికెట్​కు నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుంది. గులాబి బంతితో నిన్న (మంగళవారం)సాధన చేశా. ఎరుపు బంతితో పోలిస్తే ఇది ఎక్కువగా స్వింగ్ అవుతుంది. గులాబి బంతితో ఆడేటపుడు మరింత ఏకాగ్రతతో ఆడాల్సి ఉంటుంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.

రెండు టెస్టుల సిరీస్​లో భాగంగాగురువారం ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నెల 22న కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​లో రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​తోనే టీమిండియా తొలిసారిగా డే/నైట్ టెస్టు గులాబి బంతితో ఆడనుంది.

ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్​లో సింధు, ప్రణయ్ శుభారంభం

ABOUT THE AUTHOR

...view details