తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుడ్డోడి బ్యాటింగ్​పై నెట్టింట కోహ్లీ-పీటర్సన్​ చర్చ - విరాట్​, పీటర్సన్​

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే విరాట్​ కోహ్లీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ కెవిన్​ పీటర్సన్​ చేసిన ఓ పోస్టుకు అబ్బురపడి సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణ నెట్టింట వైరల్​గా మారింది.

Virat Kohli responds to Kevin Pietersen
నెట్టింట బుడ్డోడి బ్యాటింగ్​... కోహ్లీ-పీటర్సన్​ చర్చ

By

Published : Dec 13, 2019, 10:01 PM IST

ఓ పిల్లాడు డైపర్​ వేసుకుని క్రికెట్​ ఆడుతున్న వీడియో ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్​గా మారింది. ప్లాస్టిక్​ బ్యాట్​తో స్ట్రైట్​ డ్రైవ్​, కవర్​ డ్రైవలు కొడుతూ ఆ బుడ్డోడు ఆకట్టుకున్నాడు. తాజాగా ఆ వీడియోపై విరాట్​కోహ్లీ-పీటర్సన్​ మధ్య చర్చ జరిగింది.

ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్ పీటర్సన్​ ఆ కుర్రాడి వీడియోను పోస్టు చేసి.. "కోహ్లీ ఇతడిని మీ జట్టులోకి తీసుకోగలవా" అని ప్రశ్నించాడు. దానికి కోహ్లీ సమాధానమిచ్చాడు. "అతడు ఎక్కడ నుంచి వచ్చాడు. నిజంగా నమ్మలేకపోతున్నా" అని ఆ బుడ్డోడి ప్రతిభకు కితాబిచ్చాడు విరాట్​.

విరాట్​-పీటర్సన్​ చర్చ

ఈ వీడియోపై దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్​ జాక్వెస్​ కలిస్​ కూడా స్పందించాడు. ఇంకా నిక్కర్లు వేసుకోకముందే మంచి టాలెంట్​ సొంతం చేసుకున్నాడని ప్రశంసలు కురిపించాడు. మొదటిసారి దీన్ని నవంబర్​లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్​ వాన్​ షేర్​ చేశాడు.

ప్రస్తుతం విరాట్​ సారథ్యంలోని టీమిండియా చెన్నైలో ఉంది. విండీస్​తో మూడు వన్డేల సిరీస్​లో భాగంగా మొదటి మ్యాచ్​ చపాక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్​కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details