తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారు లేకున్నా సౌతాఫ్రికా బలమైన ప్రత్యర్థే' - రోజ్​బౌల్ గ్రౌండ్

ప్రపంచకప్​లో నేడు దక్షిణాఫ్రికాతో తలపడనుంది టీమిండియా. ఈ మెగా టోర్నీలో భారత్​కిదే తొలి మ్యాచ్​. భారత క్రికెట్​ జట్టు సారథి విరాట్​ కోహ్లీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

'గాయపడినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు' అన్న విరాట్ కోహ్లీ

By

Published : Jun 5, 2019, 12:42 PM IST

దక్షిణాఫ్రికా జట్టులోని పేసర్లు డేల్​ స్టెయిన్​, లుంగి ఎంగిడి గాయాలతో దూరమైనా ఆ జట్టు చాలా బలమైనదని అభిప్రాయపడ్డాడు కోహ్లీ. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయట్లేదని సమాధానమిచ్చాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్​కు ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్ పూర్తి ఫిట్​గా ఉన్నట్లు వెల్లడించాడు కోహ్లీ.

" ఆటలో గాయాలు సాధారణం. అవి ఎలా జరుగుతాయో ఊహించలేం. అయితే ఏ జట్టులోనైనా ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందిపడితే మంచిది కాదు. దక్షిణాఫ్రికా బలమైన ప్రత్యర్థి, అనుభవజ్ఞులు ఉన్న జట్టు. ఇద్దరు బౌలర్లు తప్పుకున్నా సౌతాఫ్రికా బలంగానే ఉంది" - విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్​

రోజ్​ బౌల్​ వేదికగా దక్షిణాప్రికాతో నేడు తొలి మ్యాచ్​ ఆడనుంది భారత్​. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ సఫారీలు ఓటమి పాలయ్యారు. తొలి మ్యాచ్​లో 104 పరుగులతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోగా.. రెండో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ చేతిలో 21 పరుగుల తేడాతో ఖంగుతిన్నారు.

స్టెయిన్​ భుజం గాయం కారణంగా తప్పుకోగా అతడి స్థానంలో మరో ఎడమ చేతి వాటం ఫాస్ట్​ బౌలర్​ బ్యూరెన్​ హెండ్రిక్స్ జట్టులోకి​ వచ్చాడు. మరో బౌలర్​ లుంగి ఎంగిడికి తొడకండరాల గాయం కారణంగా దాదాపు పది రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు వైద్యులు.

స్టెయిన్​ గాయంపై స్పందించిన కోహ్లీ... అతడు తనకు మంచి స్నేహితుడని, దేశం కోసం బాగా కష్టపడే ఆటగాడిగా అభివర్ణించాడు. స్టెయిన్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

'' ఒకరిద్దరు ఆటగాళ్లు గాయపడినంత మాత్రాన ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ గాయపడిన ఆటగాడి స్థానంలో యువ క్రికెటర్​ జట్టులోకి వచ్చాడంటే.. అతడి ప్రదర్శన మ్యాచ్​లను మలుపు తిప్పొచ్చు."
-విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్​

మ్యాచ్​ ఆడలేదు కదా...సమస్యేం లేదా..?

'ప్రపంచకప్​ ప్రారంభమై వారం రోజులు గడిచినా భారత్​ ఒక్క మ్యాచ్​ ఆడలేదు. మిగతా జట్లన్నీ రెండేసి మ్యాచ్​లు ఆడేశాయి. ఇది భారత్​కు సమస్య కాదా' అన్న ప్రశ్నకు కోహ్లీ స్పందించాడు.

ఈ సమయంలో 9 జట్ల ఆటను అంచనా వేసుకునే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డాడు భారత సారథి.

" ఇది నిజంగా మాకు లాభించే అంశమే . జట్లు ఎలా ఓడిపోతున్నాయి. ఎలాంటి సందర్భాలు కలిసివస్తున్నాయి. వారి బలాలు, బలహీనతలేంటి.?... ఇదంతా తెలియాలంటే మిగతా జట్ల ఆటతీరు గమనించాల్సిందే. ఇన్ని విధాలుగా ఆలోచించి వాటి నుంచి నేర్చుకునేందుకు సమయం దొరికింది. " -విరాట్​ కోహ్లీ, భారత క్రికెట్​ జట్టు సారథి

మ్యాచ్​ రోజున జట్టు ప్రదర్శన చాలా ముఖ్యమైనది అంతేకాని జట్టు ముందు మ్యాచ్​లు ఆడిందా లేదా అన్నది పట్టించుకోనవసరం లేదు. పిచ్​ అనుకూలత, వాతావరణాన్ని బట్టి తుది జట్టులో ఎంతమంది బౌలర్లు, స్పిన్నర్లు ఉండాలనేది నిర్ణయించుకుంటాం.

జాదవ్​ పూర్తి ఫిట్​...

భారత ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్​ గాయంపైనా మాట్లాడాడు కోహ్లీ. 'ప్రాక్టీసు సెషన్​లో బ్యాటింగ్​, బౌలింగ్​ చేస్తున్నాడు. మ్యాచ్​ రోజున అందుబాటులోకి వస్తాడని' వెల్లడించాడు.

ఇది చదవండి: భారత్​ వేట షురూ- నేడు దక్షిణాఫ్రికాతో ఢీ

ABOUT THE AUTHOR

...view details