తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ​ రికార్డు

భారత కెప్టెన్​ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో ఆసియా బయట దేశాల్లో 9000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఉపఖండ ​ బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత కెప్టెన్​ విరాట్ కోహ్లీ

By

Published : Sep 1, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 1:02 AM IST

వెస్డిండీస్​తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అర్ధ సెంచరీతో రాణించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 76 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఓ ఘనత సాధించాడు. ఆసియా బయట దేశాల్లో 9000 అంతర్జాతీయ పరుగులు చేసిన నాలుగో ఉపఖండ బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర.. ఇతడి కంటే ముందున్నారు.

ఈ జాబితాలో దిగ్గజ సచిన్ తెందుల్కర్​.. 12,616 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 10,711 పరుగులతో ద్రవిడ్, 9593 పరుగులతో సంగక్కర తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వెస్టిండీస్​తో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ

గత కొన్నేళ్లుగా సూపర్​ ఫామ్​లో ఉన్న టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. భారత తరఫున టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు. వెస్టిండీస్​ పర్యటనలో తొలి టెస్టు గెలిచిన భారత్.. జమైకా వేదికగా రెండో టెస్టు ఆడుతోంది.

ఇది చదవండి: గెలిచిన ఆనందంలో గంతులేశాడు..!

Last Updated : Sep 29, 2019, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details