న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా నిరాశపర్చింది. కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో అతడికి మద్ధతుగా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
'క్రికెట్ కెరీర్లో అందరూ సంధి దశ ఎదుర్కొన్నవారే. అప్పట్లో సచిన్, లారా.. ఇప్పుడు స్టీవ్ స్మిత్‌లకు ఫామ్‌లేమి బాధ తప్పట్లేదు. ఒకానొక సమయంలో నేనూ ఈ సమస్యను ఎదుర్కొన్నా. అయినా సహజసిద్ధమైన ఆటను వదులుకోలేదు. మళ్లీ ఫామ్ అందుకోవాలంటే కాస్త సహనం అవసరం. కోహ్లీ తప్పుకుండా తిరిగి జోరందుకుంటాడు. కివీస్‌తో సిరీస్‌ల్లో అతడు బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో ప్రయత్నాలు చేశాడు. కానీ అదృష్టం కలిసిరాలేదు' -వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్