తెలంగాణ

telangana

ETV Bharat / sports

అనితర సాధ్యుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

భారత్​ తరఫున టెస్టుల్లో అరుదైన ఘనతలు సాధించాడు కెప్టెన్​ విరాట్ కోహ్లీ. మాజీ సారథులు ధోనీ, గంగూలీ రికార్డులను అధిగమించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు.

భారత కెప్టెన్​ విరాట్ కోహ్లీ

By

Published : Sep 3, 2019, 9:27 AM IST

Updated : Sep 29, 2019, 6:22 AM IST

వెస్టిండీస్​ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​​లో ఘనంగా బోణి కొట్టింది టీమిండియా. ఆదివారం జరిగిన రెండో టెస్టును 257 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ క్రమంలో భారత్​ తరఫున ఈ ఫార్మాట్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అదే విధంగా ధోనీని అధిగమించి తన పేరిట పలు రికార్డులు నమోదు చేశాడు.

ఇప్పటి వరకు 48 టెస్టులకు కెప్టెన్సీ వహించిన కోహ్లీ.. 28 విజయాలు సాధించాడు. మొత్తంగా చూస్తే ఇతడి కంటే ముందు ఆస్టేలియాకు చెందిన స్టీవ్ వా(36), రికీ పాంటింగ్(33) ఉన్నారు.

భారత్​ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా నిలిచిన విరాట్ కోహ్లీ

భారత్​ కెప్టెన్​గా అత్యధిక టెస్టు మ్యాచ్​ల్లో(28) విజయం సాధించింది కోహ్లీనే కావడం విశేషం. ఇతడి తర్వాతి స్థానంలో మాజీ సారథి ధోనీ(27) ఉన్నాడు.

2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. అక్కడి నుంచి అతడి జైత్రయాత్ర మొదలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో విజయాలు నమోదు చేసి టీమిండియా సక్సెస్​ఫుల్ టెస్టు​ కెప్టెన్​గా నిలిచాడు.

టెస్టు విజయాల్లో ధోనీ గెలుపు శాతం 45. అతడి సారథ్యంలో భారత జట్టు 45 మ్యాచ్​లు ఆడగా 27 విజయాలు, 18 ఓటములు, 10 డ్రా అయ్యాయి. అదే కోహ్లీ విషయానికొస్తే 55.31 శాతంగా ఉంది. కెప్టెన్​గా 48 మ్యాచ్​లాడిన విరాట్.. 28 విజయాలు, 10 ఓటములు, 10 డ్రాలతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత సౌరవ్ గంగూలీ 42.85 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు.

విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్​ల్లోనూ 13 గెలుచుకుని, భారత మాజీ సారథి సౌరవ్​ గంగూలీ(11) రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ.

ఇదీ చదవండి: భారత్​ జోరుకు విండీస్​​ విలవిల- సిరీస్​ కైవసం

Last Updated : Sep 29, 2019, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details