తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శతకం కోసం కోహ్లీ ఎంతో ఆరాటపడ్డాడు' - kohli

నిన్నటి మ్యాచ్​లో భారత సారథి విరాట్ కోహ్లీని గమనిస్తే సెంచరీ కోసం అతడు ఎంత ఆరాటపడ్డాడో తెలుస్తుందని టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఐదు నెలల తర్వాత శతకం సాధించాడు కోహ్లీ.

భువనేశ్వర్ కుమార్

By

Published : Aug 12, 2019, 12:21 PM IST

Updated : Sep 26, 2019, 5:52 PM IST

శతకం కోసం విరాట్​ కోహ్లీ తీవ్రంగా ఆరాటపడ్డాడని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. 11 ఇన్నింగ్స్​ తర్వాత విరాట్ చేసిన ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైనదని తెలిపాడు.

శతక్కొట్టిన విరాట్

"శతకం కోసం ఎంత తీవ్రంగా ఆరాటపడ్డాడో నిన్నటి మ్యాచ్​లో విరాట్​ను గమనిస్తే మీకే అర్థమవుతుంది. 70, 80 పరుగుల వద్ద చాలాసార్లు ఔటయ్యాడు. భారీ స్కోరు చేసేందుకే అతడు ఎప్పుడూ చూస్తాడు" - భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్

ఆ పిచ్​పై వికెట్ తీయడం అంత సులభం కాదని తెలిపాడు భువనేశ్వర్ కుమార్.

"పొదుపుగా బౌలింగ్ చేద్దామని అనుకున్నా. ఎక్కువ డాట్ బాల్స్​ వేసి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టాలనుకున్నా. అందులో భాగంగానే వికెట్లు కూడా పడ్డాయి. మ్యాచ్ ఫలితం గురించి అంతగా ఆలోచించలేదు. ఒకటి రెండు వికెట్లు తీస్తే ఫలితం మాకే అనుకూలిస్తుందని ముందే తెలుసు" -భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్​.

ట్రినిడాడ్ వేదికగా విండీస్​తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 120 పరుగులు చేసి కెరీర్​లో 42వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 8 ఓవర్లు వేసి కేవలం 31 పరుగులిచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి విజృభణతో విండీస్​తో వన్డే సిరీస్​లో భారత్ బోణీ కొట్టింది.

ఇదీ చదవండి: అండర్-19 త్రైపాక్షిక సిరీస్​లో భారత్ విజయం

Last Updated : Sep 26, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details