కొంతకాలంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో తెలుగు సినీ ప్రముఖులను అనుసరిస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. 'బుట్టబొమ్మా బుట్టబొమ్మా' పాట మొదలుకొని ఎన్టీఆర్, మహేశ్ బాబుల డైలాగ్స్‌ని తనదైన శైలిలో పలుకుతూ అలరిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రంలోని ఓ ఫొటోను, తన ఫొటోను జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు.
ప్రభాస్ బాగున్నాడా.. నేనా? వార్నర్ మరో పోస్ట్ - David warner prabhas news
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాడు. 'బాహుబలి'లోని ప్రభాస్ ఫొటోతో పాటు తన ఫొటోను ఉంచి నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించాడు.
వార్నర్
ఆ ఫొటోకు.. "మాలో ఎవరి దుస్తులు మీరు ఎంచుకుంటారు.." అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు వార్నర్. ఫొటో చూసి.. "అచ్చం దేవేంద్ర బాహుబలిలా ఉన్నావు" అని ఒకరంటే, మరికొందరు "ఆస్ట్రేలియన్ బాహుబలి డేవిడ్‌బాయ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద కొన్నాళ్లుగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రసీమ నటులను అనుసరిస్తూ హంగామా చేస్తున్నాడు.