టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. చివరి మూడు ఛాంపియన్ షిప్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు విజయ్‌కు కౌంటీ క్లబ్ నుంచి పిలుపు వచ్చింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ స్థానంలో ఈ భారత ఆటగాడికి అవకాశం లభించింది.
సోమర్సెట్ జట్టులో చేరేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. లీగ్‌లో విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా.
-విజయ్, టీమిండియా ఆటగాడు
ప్రస్తుతం విజయ్ వయసు 35 సంవత్సరాలు. టీమిండియా తరఫున 61 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 38.28 సగటుతో 3,982 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 167. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.
131 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన విజయ్.. 42.79 సగటుతో 9,116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 266.
గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఎసెక్స్ తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు విజయ్. మూడు మ్యాచ్‌ల్లో 64.60 సగటుతో 300 పరుగులు సాధించాడు.
ఇవీ చూడండి.. విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు