తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్​ క్రికెటర్​​ రోల్​లో విజయ్​ సేతుపతి! - vijay setupathi

దక్షిణాదిలో విలక్షణ నటుడిగా రాణిస్తోన్న విజయ్​ సేతుపతి త్వరలో క్రికెటర్​గా కనిపించనున్నాడు. దిగ్గజ లంక బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ బయోపిక్​లో నటించనున్నాడు.

విజయ్ సేతుపతి

By

Published : Jul 26, 2019, 4:27 PM IST

కోలీవుడ్​ నటుడు విజయ్​ సేతుపతి త్వరలో ఓ బయోపిక్​లో నటించనున్నాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ జీవిత కథ ఆధారంగా ఇది తెరకెక్కనుంది. ఎంఎస్‌ శ్రీపతి దర్శకుడు. డార్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు '800' అనే టైటిల్‌ను ఫిక్స్​ చేసే యోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా గురించి నటుడు విజయ్​, ఆటగాడు ముత్తయ్య మాట్లాడారు.

"నా జీవిత కథ తెరపైకి వస్తుందనే విషయం వింటేనే చాలా ఆనందంగా ఉంది. 2020లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌సేతుపతి వంటి అంకితభావమున్న నటుడు నా పాత్ర పోషించడం మరింత గౌరవంగా ఉంది".
--ముత్తయ్య మురళీధరన్​, లంక మాజీ క్రికెటర్​

"మురళీధరన్‌ పాత్రలో నటించడం కెరీర్‌లోనే ఓ గొప్ప విషయం. చాలా గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయం" -విజయ్‌ సేతుపతి, హీరో

విజయ్ సేతుపతి ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవే కాకుండా తమిళంలో 'సింధ్​బాద్​' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇది చదవండి: సమీక్ష: భావోద్వేగాల 'డియర్ కామ్రేడ్'

ABOUT THE AUTHOR

...view details