విజయ్ హజారే టోర్నీలో యువ బ్యాట్స్మెన్లు రాహుల్ తెవాతియా, సూర్యకుమార్ యాదవ్‌లు రెచ్చిపోయారు. టీమ్ఇండియా పొట్టి ఫార్మాట్‌కు ఎంపికయ్యామన్న ఆనందాన్ని వారి బ్యాటింగ్‌లో చూపెట్టారు. వీరితో పాటు పృథ్వీ షా సెంచరీతో సత్తా చాటాడు.
గ్రూప్-డీలోని దిల్లీ, ముంబయిల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్ సింగ్ శతకంతో ఆకట్టుకోగా.. శివ్కాంత్ వశిష్ఠ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 31.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా 89 బంతుల్లోనే 105 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
దిల్లీ: 211/7, 50 ఓవర్లు. (హిమ్మత్ సింగ్ 106, శివ్కాంత్ వశిష్ఠ్ 55, ధవళ్ కులకర్ణి 35/3, శామ్స్ ములాని 33/2)
ముంబయి: 216/3, 31.5 ఓవర్లు. (పృథ్వీ షా 105, సూర్యకుమార్ యాదవ్ 50, లలిత్ యాదవ్ 32/2)
హరియాణా, చండీగఢ్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో రాహుల్ తెవాతియా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్ష్ రాణా సెంచరీకి తోడు అరుణ్ చప్రానా, రాహుల్ తెవాతియాలు హాఫ్ సెంచరీలు చేశారు. అటు బంతితోనూ రాహుల్ రాణించినప్పటికీ అతని జట్టు ఓటమి పాలైంది. చండీగఢ్ టీమ్.. లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మనన్ వోహ్రా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు అంకిత్ కౌషిక్ అర్ధ సెంచరీతో జట్టు విజయానికి సహకరించాడు.
సంక్షిప్త స్కోర్లు: