టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటన ఓ పీడకలగా మారింది. టీ20, వన్డే, టెస్టు.. ఇలా ఏ ఫార్మాట్ అయినా దూకుడు ప్రదర్శించే కోహ్లీ.. ఈ టూర్లో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయాడు. బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గా అతడు తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. మొత్తంగా విరాట్ కెరీర్లో 14 సార్లు ఎల్బీడబ్ల్యూకు గురవగా ప్రతీసారి సమీక్ష కోరాడు. అందులో ఎక్కువ శాతం విఫలమైనవే.
కెప్టెన్ కోహ్లీ సమీక్ష కోరలేదే.. ఎందుకో ?
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి, ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ పర్యటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ సిరీస్‌లో ఆద్యంతం విఫలమైన విరాట్.. సమీక్ష కోరడంలోనూ తడబడ్డాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్ సౌథీ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లను తాకింది. సౌథీ అప్పీలు చేయగా, అంపైర్ విరాట్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని అంగీకరించని కోహ్లీ.. వెంటనే సమీక్ష కోరాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా భారత్ వద్ద ఉన్న ఏకైక డీఆర్‌ఎస్ అవకాశం వృథా అయింది. ఇలా రివ్యూ కోల్పోవడం కోహ్లీకి ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు 14 సార్లు ఎల్బీగా ఔటైన కోహ్లీ.. ప్రతిసారి సమీక్ష ఉపయోగించుకున్నాడు. వీటిలో 9సార్లు ఎటువంటి ప్రయోజనం లేకపోగా, రెండుసార్లు ఫలితం కోహ్లీకి అనుకూలంగా వచ్చింది. మిగతా మూడుసార్లు నిర్ణయం అంపైర్ అభిప్రాయానికే(అంటే అంపైర్స్ కాల్) వదిలేశారు.
కానీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డీఆర్‌ఎస్ వాడటంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరంగా సమీక్ష వృథా చేశాడంటూ కోహ్లీని విమర్శిస్తున్నారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో కూడా ఎల్బీగానే వెనుదిరిగిన కోహ్లీ.. ఈసారి మాత్రం డీఆర్‌ఎస్ ఉపయోగించుకోలేదు.