తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంతి తగిలి... అంపైర్​ మృతి

ఇంగ్లాండ్​ కౌంటీ క్రికెట్​లో బంతి తగిలి గాయపడిన అంపైర్ జాన్​ విలియమ్స్​​(80) నెలరోజుల తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. జులై 13న లండన్​లో ఈ సంఘటన జరిగింది.

By

Published : Aug 16, 2019, 3:06 PM IST

Updated : Sep 27, 2019, 4:51 AM IST

అంపైర్​

నెలరోజుల క్రితం లండన్​లో జరిగిన కౌంటీ మ్యాచ్​లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్​. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్​బ్రోక్​ - నార్​బెత్​ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

అంపైర్​ మరణించిన విషయాన్ని పెమ్​బ్రోక్​షైర్​ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది.

"అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సి వచ్చింది. జాన్ ఈ రోజు ఉదయాన్నే మరణించారు. పెమ్​బ్రోక్​షైర్ క్రికెట్​ క్లబ్ తరపున సంతాపం తెలుపుతున్నాం." -పెమ్​బ్రోక్​షైర్ క్రికెట్ క్లబ్​

ఆ మ్యాచ్​లో అంపైర్​ జాన్​ తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స​కోసం హావర్​ఫోర్డ్​వెస్ట్​లోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది చదవండి: రాబిన్​తో టీమిండియా కోచ్ ఇంటర్వ్యూలు షురూ

Last Updated : Sep 27, 2019, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details