భారత బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగయ్యారు. తాజాగా విడుదల చేసిన ట్వీ-ట్వంటీ ర్యాంకుల్లో రోడ్రిగ్స్ రెండో స్థానంలో నిలవగా, స్మృతి ఆరో స్థానానికి ఎగబాకింది.
టీ-ట్వంటీ ర్యాంకింగ్స్‌లో రోడ్రిగ్స్ 2, స్మృతి 6 - smriti mandana
మహిళా టీ-ట్వంటీ ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగో స్థానంతో ఉంది.
న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు విఫలమైనా తమ బ్యాటింగ్‌తో స్మృతి, రోడ్రిగ్స్ ఆకట్టుకున్నారు. సిరీస్‌లో 132 పరుగులు చేసి రోడ్రిగ్స్ రెండో స్థానానికి చేరింది. గత వారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని సాధించిన స్మృతి.. టీ20ల్లోనూ నాలుగు స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానానికి చేరుకుంది.
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాధా యాదవ్ 18 స్థానాలు ఎగబాకి 10 ర్యాంకుకు చేరింది. ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని దీప్తి శర్మ 14వ స్థానం వద్ద ఉంది.
జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు మెదటి స్థానంలో ఉండగా, భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.