ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20ల సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ దూరమవ్వడం వల్ల శిఖర్ ధావన్‌తో ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా సత్తాచాటుతున్నప్పటికీ అతడు మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడని వార్తలు వస్తున్నాయి. దీంతో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఒకరు ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, గిల్‌కు సూచనలు ఇస్తున్న చిత్రాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విట్టర్‌లో షేర్ చేయడం వల్ల ధావన్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి.
గబ్బర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు? - శిఖర్ ధావన్ వార్తలు
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు ఓపెనర్లుగా శిఖర్ ధావన్‌తో పాటు శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమ్ఇండియా ప్రధానకోచ్ రవిశాస్త్రి.. గిల్‌కు సూచనలు ఇస్తున్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం వల్ల ధావన్‌తో పాటు గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తొలి వన్డే తుది జట్టులో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ సత్తాచాటాడు. కోల్‌కతా తరఫున 440 పరుగులు చేశాడు. కాగా, పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన మయాంక్ అగర్వాల్ కూడా 418 పరుగులతో రాణించాడు. అయితే తొలివన్డేకు తుదిజట్టులో తొమ్మిది ఆటగాళ్ల స్థానాలు దాదాపు ఖరారైనట్లే. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా తుదిజట్టులో ఉంటారు. షమితో పాటు సైనీని తీసుకుంటే శార్దూల్ ఠాకూర్‌కు నిరాశ తప్పదు.
ఒకవేళ టీ20లు, టెస్టు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, షమిలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శార్దూల్‌కు తొలి వన్డేలో ఆడే అవకాశం లభిస్తుంది. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.