తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ద్రవిడ్ మూడు ఫోర్లు బాదాడు.. వచ్చి మాట్లాడాడు'

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్​పై ప్రశంసల జల్లు కురిపించాడు వెస్టిండీస్ మాజీ బౌలర్ టినో బెస్ట్. తన బౌలింగ్​లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడని.. మ్యాచ్ అనంతరం ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని తెలిపాడు.

ద్రవిడ్‌ అలా ఆడాక.. వచ్చి మాట్లాడాడు
ద్రవిడ్‌ అలా ఆడాక.. వచ్చి మాట్లాడాడు

By

Published : Jul 19, 2020, 7:03 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఓ సందర్భంలో తన బౌలింగ్‌లో చితక బాది తర్వాత వచ్చి తనతో మాట్లాడాడని వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ టినో బెస్ట్‌ గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2005లో ఇండియన్‌ ఆయిల్‌ కప్‌ సందర్భంగా తాను తొలిసారి టీమ్‌ఇండియాతో ఆడానని, ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం దక్కిందన్నాడు. తన బౌలింగ్‌లో ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడని, మ్యాచ్‌ అనంతరం ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నామని తెలిపాడు.

"ద్రవిడ్‌ నా వద్దకు వచ్చి ‘యంగ్‌ మ్యాన్‌.. నీ శక్తి సామర్థ్యాలు నచ్చాయి. అలాగే కొనసాగు. నీ బౌలింగ్‌లో ఫోర్లు కొట్టినంత మాత్రాన అక్కడే ఆగిపోకు అని చెప్పాడు. దాంతో ఆయనంటే నాకు గౌరవం పెరిగింది. అలా నేనెప్పుడూ టీమ్‌ఇండియా క్రికెటర్లను అభిమానిస్తూ ఉంటాను. ఒకసారి యువరాజ్‌ నాకు బ్యాట్‌ ఇచ్చాడు. భారత క్రికెటర్లు ఎంతో మంచివాళ్లు. వినయంగా ఉంటారు. తాము గొప్పవాళ్లమని ఎప్పుడూ అనుకోరు. వారిలో నాకు అదే నచ్చుతుంది. వాళ్లెప్పుడూ చెడు విషయాల జోలికి వెళ్లరు. ఎప్పుడూ ఆటను గౌరవిస్తూ దాని మీదే శ్రద్ధ పెడతారు" అని బెస్ట్‌ వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details