పాకిస్థాన్ సూపర్‌లీగ్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫవాద్ అహ్మద్‌కు సోమవారం కరోనా సోకగా.. మంగళవారం మరో మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ విదేశీ ఆటగాళ్లతో పాటు ఓ సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
పీఎస్ఎల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ - పీఎస్ఎల్ 2021
ఇటీవలే ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్‌లీగ్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఈ లీగ్‌లో ఓ కొవిడ్ కేసు నమోదవ్వగా.. మంగళవారం మరో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
పీఎస్ఎల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్
పీఎస్ఎల్లో ఇప్పటివరకు నాలుగు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మ్యాచ్ షెడ్యూల్‌ను యథావిధిగా నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరో క్రికెటర్‌కు నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితం రావాల్సి ఉందని పీసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో బయోబబుల్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఫ్రాంఛైజీలతో పీసీబీ ఓ వర్చువల్ మీటింగ్ నిర్వహించనుంది.