భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ఎంపికైన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఈ అవార్డును తన అభిమానులందరికీ అంకితమిచ్చాడు. వారు లేకుండా ఈ ఘతన సాధ్యం కాదని స్పష్టం చేస్తూ వీడియోను ట్వీట్ చేశాడు. ఇతడితో పాటు పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనిక బత్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
ఇంతటి ఘనమైన గౌరవాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. దీనికి కారణం మీరే(అభిమానులు), మీ అందరికీ రుణపడి ఉన్నా. మీ మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. మీరు నాతో ఉంటే దేశం కోసం మరిన్ని పురస్కారాలను తీసుకొస్తా. ప్రస్తుతం భౌతిక దూరం పాటిస్తున్నందు వల్ల.. మీ అందరికీ ఆన్లైన్ వేదికగా హగ్ ఇస్తున్నా.