భారత్ vs ఆస్ట్రేలియా మూడో టెస్టు సిడ్నీలోనే జరుగుతుందని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసింది.
సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ మూడో టెస్టు జరుగుతుందా లేదా అనే గత కొద్ది రోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ బోర్డు స్పష్టత ఇచ్చింది. జనవరి 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరగనుంది. ఇందులో రోహిత్ శర్మ ఆడే విషయమై టీమ్ఇండియా ఇంకా ఏ మాట చెప్పలేదు.