తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థానీ ఫ్యాన్​కు ధోని టికెట్లు పంపేది అందుకే! - భారత క్రికెట్ జట్టు

భారత్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోని.. పాక్​కు చెందిన తన ఫ్యాన్​పై అంతులేని అభిమానాన్ని చూపించాడు. పాకిస్థానీ అయినా అతడికి ప్రపంచకప్​లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్​ కోసం సొంత డబ్బులతో టికెట్ కొనిచ్చాడు మహీ.

అభిమానిపై ధోని అంతులేని అభిమానం

By

Published : Jun 15, 2019, 4:57 PM IST

ప్రపంచకప్​లో రసవత్తరమైన మ్యాచ్​లకు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులకో, స్నేహితులకో టికెట్లు ఉచితంగా అందిస్తుంటారు. అది కూడా మహా అయితే ఏ కొద్ది మ్యాచ్​లకో ఈ సాయం చేస్తుంటారు. దోని మాత్రం ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం. తన అభిమాని మహ్మద్​ బషీర్​కుఎప్పటినుంచో మ్యాచ్​ టికెట్లు పంపుతున్నాడు. బషీర్​... పాకిస్థానీ కావడం విశేషం.

2011 ప్రపంచకప్​లో మొహాలీ వేదికగా భారత్​-పాక్​ మధ్య జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​ సందర్బంగా ధోనీకి, బషీర్​కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధంతోనే బషీర్​ షికాగో నుంచి రేపటి మ్యాచ్​ను వీక్షించేందుకు దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి మాంచెస్టర్​ చేరుకున్నాడు.

పాకిస్థాన్​లో పుట్టినప్పటికీ చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడినా భారత్​కే మద్దతు తెలుపుతుంటాడు ఈ పాకిస్థానీ.

"నేను ఇక్కడుకు గురువారం వచ్చాను. ఆదివారం భారత్​-పాక్ మధ్య జరిగే మ్యాచ్​ చూసేందుకు ఒక్కో టికెట్ కోసం 800-900 పౌండ్లు (దాదాపు రూ. 71,976- రూ. 80,973) చెల్లించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం ఇక్కడి నుంచి షికాగో ప్రయాణించేందుకు సరిపోతుంది. ధోనీకి ధన్యవాదాలు. మ్యాచ్​ టికెట్​కై నాకెలాంటి సమస్యలు లేవు.

పాకిస్థానీ అభిమాని మహ్మద్ బషీర్

ధోనీ ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు కాబట్టి నేను అతడికి ఫోన్​ చేయలేదు. కేవలం మెసేజ్​ ద్వారానే మహీకి టచ్​లో ఉన్నాను. చాలా కాలం ముందు నేను ఇక్కడకు వచ్చినప్పుడు టికెట్​ పంపుతానని ధోనీ నాకు హామీ ఇచ్చాడు. అతడో గొప్ప వ్యక్తి. ధోనీలా ఇంకెవరైనా నాకోసం ఇలా చేస్తారని నేను అనుకోవట్లేదు. 2011లో మొహాలీ మ్యాచ్​ నుంచి మహీ నాకు టికెట్లు పంపిస్తున్నాడు. అందుకే ఈసారి ధోనీకి నేను ఒక సర్​ప్రైజ్ గిఫ్ట్​ తీసుకొచ్చాను. మ్యాచ్​ అనంతరం అతడికి అది అందజేస్తాను." -మహ్మద్​ బషీర్​

ధోనీపై అభిమానంతో పాటు తన భార్యది హైదరాబాద్​ కావడం వల్ల బషీర్​ భారత్​కే మద్దతిస్తాడు. అయితే మ్యాచ్​ జరిగే సమయంలో బషీర్​ వేసుకునే జెర్సీలో భారత్​, పాక్ ఇరుదేశాల జెర్సీలు కలిసి ఉంటాయి. అందుకే ఇరుదేశాల మధ్య శాంతికి చిహ్నంగా తనను తాను చెప్పుకుంటాడు.

ఇది చదవండి: WC19: గేల్ కవ్వింపు- రూట్ చిరునవ్వు

ABOUT THE AUTHOR

...view details