తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ది మొతేరా థాలీ ఛాలెంజ్​'కు మీరు సిద్ధమా! - 'ది మొతేరా థాలీ ఛాలెంజ్​'కు మీరు సిద్ధమా!

భారత్​-ఇంగ్లాండ్ టీ20 సిరీస్​కు సరికొత్త ఛాలెంజ్​ను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది స్టార్​ స్పోర్ట్స్​ సంస్థ. అహ్మదాబాద్​లోని ఓ హోటల్​లో 'ది మొతేరా థాలీ ఛాలెంజ్​' పేరుతో తిండి పోటీలను ప్రకటించింది. అభిమానులు ఎవరైనా వీటిలో పాల్గొనవచ్చని తెలిపింది. తాజాగా ఈ సవాల్​ను భారత మాజీ ఓపెనర్ పార్థివ్​ పటేల్​ స్వీకరించాడు.

The Motera Thali Challenge
'ది మొతేరా తాళి ఛాలెంజ్​'కు మీరు సిద్ధమా!

By

Published : Mar 11, 2021, 11:40 AM IST

భారత్​-ఇంగ్లాండ్​ టీ20 సిరీస్​ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహన్ని నింపేందుకు సరికొత్త ఛాలెంజ్​తో ముందుకొచ్చింది స్టార్​ స్పోర్ట్స్ సంస్థ. అహ్మదాబాద్​లోని మారియట్​ హోటల్​లో​ "ది మొతేరా థాలీ ఛాలెంజ్​" పేరుతో క్రికెట్​ అభిమానులకు సవాల్​ విసిరింది.

అభిమానులు ఎవరైనా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు నిర్వాహకులు. కానీ, నలుగురు మాత్రమే పాల్గొనాలనేది నిబంధన. గంటలోపు ఈ ఛాలెంజ్​ను పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా ఈ సవాల్​ను భారత మాజీ ఓపెనర్​ పార్థివ్​ పటేల్​ స్వీకరించాడు.

ఆటగాళ్ల పేర్లతో వంటకాలు..

కోహ్లీ ఖమాన్, ధోనీ కిచిడి, పాండ్య పత్రా, ధావన్ ధోక్లా, బుమ్రా భిండి, పుజారా తురియా పత్రా, రోహిత్ ఆలు రషిలా, హార్దిక్ చనా కతోల్.. ఇలా ఆయా క్రికెటర్ల పేర్లను అక్కడి మెనూలోని ఐటమ్స్​కు పెట్టారు నిర్వాహకులు.

క్రికెటర్ల పేరుతో మెనూ కార్డు
ఛాలెంజ్​లో వివిధ వంటకాలు
థాలీ ఛాలెంజ్​లో పాల్గొన్న పార్థివ్​
వంటకాలను ఆరగిస్తున్న పార్థివ్

ఇదీ చదవండి:ఆర్సీబీ కొత్త వికెట్ కీపర్​గా ఫిన్​ ఆలెన్​

ABOUT THE AUTHOR

...view details