కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా క్రీడా టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. క్రికెట్ మ్యాచ్‌లైతే ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేదు. ఆదివారం ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. తమ పుట్టిన నెల ఆధారంగా క్వారంటైన్ జోడీగా ఏ ఆటగాడితో ఉంటారని అభిమానులను అడిగింది. దీనికి స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హార్ష్‌లీ గిబ్స్.. తన క్వారంటైన్ పార్ట్‌నర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని రాసుకొచ్చాడు. అతడితో కలిసి జిమ్‌కు వెళతానని చెప్పాడు. ఇద్దరూ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారే. మరోవైపు వార్నర్ దీనిపైనా స్పందించాడు. తనకు కేన్ విలియమ్సన్తో టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటానని అన్నాడు.
ఐసీసీ కొత్త గేమ్.. మీ క్వారంటైన్ జోడీ ఎవరు? - ICC Isolation Game news
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు క్రికెట్ టోర్నీలన్నీ బంద్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇళ్లలో ఖాళీగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఐసీసీ సరికొత్త గేమ్ పెట్టింది.
కొవిడ్-19తో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. 13 వేల మందికిపైగా మరణించారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరిగిపోతుండటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సామాజిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధమే ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగతా దేశాలు అప్రమత్తమవ్వాల్సిన సమయమిది. వైరస్ లక్షణాలు కలిగిన వారు, ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేవారు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.