తెలంగాణ

telangana

ETV Bharat / sports

గతేడాది ఐపీఎల్​ అందుకే ఆడలేదు: భజ్జీ - హర్భజన్ ఐపీఎల్ 2021

కెరీర్​లో తాను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అంటున్నాడు టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఐపీఎల్​లో ఈ ఏడాది కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడుతున్న భజ్జీ.. ఈ సందర్భంగా పలు అంశాలు పంచుకున్నాడు.

Harbhajan
హర్భజన్

By

Published : Apr 1, 2021, 10:41 AM IST

తాను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు, ముంబయి, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన అతడు ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున తొలిసారి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించాడు.

"చాలా మంది అనుకుంటూ ఉంటారు.. ఎందుకు అతడు ఇంకా ఆడుతున్నాడు అని? అది వారి అభిప్రాయం! నేను ఆడాలనుకుంటున్నా.. ఆడతా. ఎవరికీ నేనెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడాలన్నదే నా ఉద్దేశం. నాకంటూ కొన్ని ప్రమాణాలు నెలకొల్పుకున్నా. వాటిని అందుకోలేకపోతే నన్ను నేనే నిందించుకుంటా. ఇప్పుడు నా వయసు 20 ఏళ్లు కాదు 40 ఏళ్లు. అయితే ఈ స్థాయిలో విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు."

-హర్భజన్, టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్

తన కుటుంబ భద్రత గురించి ఆలోచించే గత ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు హర్భజన్ స్పష్టం చేశాడు. "2020లో దుబాయ్‌లో ఐపీఎల్‌ జరిగినప్పుడు కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకునే టోర్నీ నుంచి వైదొలిగా. స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉన్నా. కానీ ఈ సంవత్సరం మన దేశంలోనే లీగ్‌ జరుగుతుండడం.. పరిస్థితులకు అలవాటు పడడం వల్ల టోర్నీలో పాల్గొంటున్నా. కొవిడ్‌ టీకా కూడా రావడం వల్ల నా భార్య గీతానే ఆడమని ప్రోత్సహించింది. 2019 ఐపీఎల్‌కు ముందు దేశవాళీ టోర్నీల్లో పెద్దగా పాల్గొనకపోయినా.. ఆ సీజన్లో రాణించా. ఇప్పుడు కూడా అంతే. పోటీ క్రికెట్లో పాల్గొని చాలా రోజులు అయింది. అయితే ఈ స్థాయిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు" అని భజ్జీ తెలిపాడు.

కోల్‌కతాకు మంచి జట్టు ఉందని.. రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారని తెలిపాడు భజ్జీ. ఈ ఏడాది వేలానికి ముందు ఇతడిని చెన్నై వదులుకోగా.. మినీ వేలంలో కోల్‌కతా రూ.2 కోట్లకు దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details