కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది.. పుజారా ఫామ్‌పైనా అనుమానమే.. రిషభ్ పంత్ ఎంతమేరకు రాణిస్తాడో చెప్పలేం! టెస్టుల్లో భారత్ ఆటగాళ్లపై సగటు అభిమానికున్న సందేహాలివి. అయితే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో 3 టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో నేడు జట్టును ప్రకటించనుంది సెలక్షన్ కమిటీ. ఎవరెవరు చోటు దక్కించుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్‌శర్మను తీసుకోవచ్చు. టెస్టుల్లో సాధారణంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు రోహిత్. అయితే 5, 6 స్థానాల్లో రహానే, హనుమ విహారి నిలకడగా ఆడుతుండటం వల్ల ఓపెనర్‌గా అతడ్ని పంపే అవకాశముంది. మూడో స్థానంలో పుజారా, నాలుగులో విరాట్ కొనసాగనున్నారు.
ఓపెనర్లు విఫలమవుతున్న తరుణంలో సెహ్వాగ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్ కోసం చూస్తున్నారు కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్. ఇలాంటప్పుడు వారికున్న ఏకైక ఆప్షన్ రోహిత్‌ను టాప్ ఆర్డర్లో పంపడమే. దేశవాళీ మ్యాచ్‌ల్లో నిలకడగా రాణిస్తున్న బంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌కూ అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రాహల్ ఎంపిక చేయకుండా మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తే... రోహిత్, ఈశ్వరన్‌లలో ఒకరికి మిడిలార్డర్లో అవకాశమొస్తుంది. స్పెషలిస్టు వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్‌లలో ఒకరిని ఎంపిక చేయొచ్చు. అయితే మొదటి ప్రాధాన్యంగా పంత్‌నే ఎంచుకునే ఆలోచనలో ఉంది సెలక్షన్ కమిటీ. భువీ ఫిట్నెస్ సాధించకపోయినట్లయితే.. హార్దిక్ పాండ్య టెస్టు జట్టులోకి పునరాగమనం చేసే అవకాశముంది.
రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ లాంటి పేసర్లు రేసులో ఉన్నారు. షమికి విశ్రాంతినిస్తే ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశముంది. నవదీప్ సైని బ్యాకప్ పేసర్‌గా ఉండనున్నాడు.
జట్టు అంచనా