టెస్టు క్రికెట్లోనూ ఆటగాళ్లు పేర్లున్న జెర్సీలతో బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న యాషెస్ సిరీస్ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పంచుకుంది. ఆ దేశ క్రికెట్ సారథి రూట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తెలుపు జెర్సీపై పేరు, నెంబర్‌తో కనిపించాడు రూట్.
ఈ ఏడాది ఆరంభంలోనే టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ క్రికెటర్ల జెర్సీలపై పేర్లు ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ఫలితంగానే ఐసీసీ మార్పులు చేసింది. యాషెస్ సిరీస్‌లో ఇరు దేశాల ఆటగాళ్లు తొలిసారిగా జెర్సీలపై తమ పేర్లతో కనిపించనున్నారు.