టీమ్ఇండియా ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మైక్ హస్సీ, షేన్ వార్న్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు జరగడం బాధాకరమని తెలిపారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా పలువురు అల్లరి మూకలు భారత క్రికెటర్లపై జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసింది భారత జట్టు. ఫలితంగా నాలుగో రోజు రెండో సెషన్లో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.
"ఇదొక దారుణమైన ప్రవర్తన. ఈ కాలంలోనూ ఇలాంటివి జరగడం నమ్మశక్యంగా లేదు. వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినవారిని మైదానాలకు రాకుండా జీవితకాలం నిషేధించాలి. గొప్ప క్రికెట్ ఆడి, మనల్ని ఆనందింపజేయడానికి వచ్చింది టీమ్ఇండియా. అందుకు మనం కృతజ్ఞత చూపాలి. క్రికెటర్లను అవమానించడం ఆమోదయోగ్యం కాదు."
-మైక్ హస్సీ
హస్సీతో పాటే ఆసీస్ మాజీ బౌలర్ షేన్ వార్న్.. ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశాడు.