తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్​

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్​తో పాటు అలెన్ డోనాల్డ్​, కాథరీన్ ఫిట్జిప్యాట్రిక్​లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కింది.

సచిన్

By

Published : Jul 19, 2019, 10:16 AM IST

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​​కు చోటు దక్కింది. మాస్టర్​ బ్లాస్టర్​తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డోనాల్డ్​, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ కాథరీన్ ఫిట్జిప్యాట్రిక్​లకు స్థానం లభించింది.

వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగాసచిన్ ఘనత సాధించాడు. కెరీర్లో 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్​ లెజెండ్ సచిన్​కు ఈ గౌరవం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఐసీసీ తెలిపింది.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం గౌరవం పొందిన ఆరో భారత క్రికెటర్ సచిన్. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రావిడ్(2018)ఈ ఘనత సాధించారు.

దక్షిణాఫ్రికా బౌలర్ అలెన్ డోనాల్డ్​ కెరీర్లో 330 టెస్టు వికెట్లతో పాటు, 272 వన్డే వికెట్లు సాధించాడు. 2003లో క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిట్జి​ప్యాట్రిక్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కించుకున్న ఎనిమిదో మహిళ. 60 టెస్ట్, 180 వన్డే వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన మహిళా క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచింది. ఆసీస్ మహిళా క్రికెట్ జట్టుకు కోచ్​గా పనిచేస్తూ మూడు ప్రపంచకప్​ టైటిల్స్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది.


ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం గౌరవం పొందిన ఆరో భారత క్రికెటర్ సచిన్. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రావిడ్(2018)ఈ ఘనత సాధించారు.

ఇవీ చూడండి.. విండీస్​ పర్యటనకు భారత జట్టు ఎంపిక 21న..

ABOUT THE AUTHOR

...view details