తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాహోర్​ దాడికి 10 ఏళ్లు - లాహోర్

క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరబోయేలా చేసిన లాహోర్ దాడికి నేటికి సరిగ్గా పదేళ్లు గడిచాయి. 2009 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో ఇప్పటికీ ఇతర దేశాలు పాక్ పర్యటనకు దూరంగా ఉంటున్నాయి.

లాహోర్ స్టేడియం

By

Published : Mar 3, 2019, 12:14 PM IST

పాకిస్థాన్ క్రికెట్​తో పాటు క్రీడాప్రపంచాన్ని నివ్వెరపరిచిన లాహోర్ బాంబు దాడి జరిగి నేటికి సరిగ్గా 10 సంవతర్సాలు అవుతోంది. ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని మృత్యు ఒడిలోంచి బయటపడ్డ అంపైర్ అహ్సన్ రజా తెలిపాడు.

అది 2009,మార్చి 3 .. పాకిస్థాన్-శ్రీలంక మధ్య రెండో టెస్టుకు రిజర్వు అంపైర్​గా ఉన్నాడు రజా. ఇతర మ్యాచ్ అధికారులతో కలిసి బస్సు​లో స్టేడియానికి వెళుతున్నాడు. ఒక్కసారిగా మిలిటెంట్లు ఫైరింగ్​కు తెగబడ్డారు. ఆ ఘటనలో 8 మంది చనిపోగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు రజా ఊపిరితిత్తులు, కాలేయంలోకి దూసుకెళ్లాయి. 6 నెలల తర్వాత ఆయన కోమాలోంచి కోలుకున్నారు.

ఆ ఘటన తర్వాత పాకిస్థాన్​లో క్రికెట్ ఆడటానికి ఏ దేశం ధైర్యం చేయలేదు. దశాబ్ద కాలం గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ పర్యటించడానికి ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు.

పాక్ తమ మ్యాచ్​లకు యూఏఈని వేదికగా ఎంచుకుంది. దీని ద్వారా ఏటా 20 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్​లోని కొన్ని మ్యాచ్​లను స్వదేశంలో జరుపుతోంది.

లాహోర్ స్టేడియంలో 2017లో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్​ని పటిష్ఠ బందోబస్తు మధ్య నిర్వహించారు. 'వరల్డ్ ఎలెవన్'​ జట్టు కూడా అక్కడ 3 టీ20 మ్యాచు​లు ఆడింది. దాడి జరిగిన 8 సంవత్సరాలకు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 2017లో శ్రీలంకతో ఒక టీ20 మ్యాచ్ నిర్వహించారు.
లాహోర్ మైదానంలో మ్యాచ్​లు నిర్వహించడానికి పీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే మరిన్ని దేశాలు పాక్ పర్యటనకు తమ దేశానికి వస్తాయంటున్నారు అధికారులు.

గత మేలో వెస్టిండీస్ పాక్ పర్యటనకు వచ్చి కరాచీలో మూడు టీ20లు ఆడింది. పీఎస్ఎల్​లో మిగిలిన 8 మ్యాచులు (ఫైనల్​తో కలిపి ) లాహోర్, కరాచీలో జరగబోతున్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మ్యాచ్​లు యథావిధిగా జరుగుతాయని పీసీబీ ప్రకటించింది.

వీలైనన్ని ఎక్కువ పీఎస్ఎల్ మ్యాచ్​లు పాక్​లో నిర్వహించడం వల్ల ఇతర దేశాలకు నమ్మకం కలుగుతుందని పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇది నెమ్మదిగా, దీర్ఘకాలికంగా జరిగే ప్రక్రియని.. ప్రస్తుతానికి కొన్ని దేశాలు సానుకూలంగా లేవని అన్నాడు.

గతేడాది పాక్​లో టీ20 సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ విముఖత వ్యక్తం చేసింది. రెండు వన్డేలు ఆడాలన్న ప్రతిపాదనను ఆస్ట్రేలియా తిరస్కరించింది. అక్టోబర్​లో శ్రీలంకతో పాక్ రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక పర్యటనతో ఇతర దేశాలూ పాక్ పర్యటనకు వస్తాయని పీసీబీ ఆశిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details