ఇంగ్లాండ్‌లోని వరల్డ్‌కప్ టోర్నీలో సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు... వీలు చిక్కినప్పుడల్లా సరదాగా గడుపుతూ ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రాన్ని మంగళవారం వీక్షించారు టీమిండియా ఆటగాళ్లు. ఈ సినిమా చూసిన తర్వాత ధోనీ, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్ ఫొటో దిగారు. నాటింగ్‌హామ్‌లోని ఓ థియేటర్ బయట తన అభిమాన హీరో సినిమా చూసినట్లు పేర్కొంటూ ఆ ఫొటో షేర్ చేశాడు కేదార్. "భారత్ సినిమా చూసిన తర్వాత భారత్ టీం" అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు.
ఇంగ్లాండ్‌లో 'భారత్' వీక్షించిన టీమిండియా - భారత్
ప్రపంచకప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు కాసేపు సేదతీరారు. మంగళవారం నాటింగ్‌హామ్‌లోని ఓ థిటేయర్లో సల్మాన్‌ఖాన్ నటించిన భారత్ సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని కేదార్ జాదవ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు.
జాదవ్ ట్వీట్ చూసి సల్మాన్ స్పందించాడు. "భారత్ సినిమాను వీక్షించనందుకు థాంక్యూ. మీరు ఆడబోయే మ్యాచ్‌లకు ఆల్ ది బెస్ట్. యావత్ భారతదేశం మీతో ఉంది" అని ఆ ఫొటోకు సమాధానమిచ్చారు.
ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు విజయాలతో ఫుల్ జోష్ మీద ఉంది. గురువారం నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన కాస్త ఇబ్బంది పెడుతోంది. రెండు పెద్ద జట్లపై వరుస విజయాలు సాధించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలికి గాయం కావడం వల్ల అతడు మూడు వారాలు బీసీసీఐ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నాడు.