సిడ్నీలో నిర్వహించే మూడో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించినా.. క్రికెటర్లను నిర్బంధించి మ్యాచ్లు నిర్వహించడం బాగోలేదని టీమ్ఇండియా ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. స్టేడియంలో దాదాపుగా 20 వేల మందికి స్వేచ్ఛనిచ్చి.. ఆటగాళ్లను 'జూ'లో జంతువుల్లా చూడటం సరికాదని అంటున్నారు.
"సిడ్నీ టెస్టులో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కానీ, ఆటగాళ్లను మాత్రం హోటల్లో నిర్బంధించి మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అది కూడా మాకు కరోనా టెస్టుల్లో నెగిటివ్గా వచ్చినా ఇలా చేయడం సమ్మతం కాదు. మమ్మల్ని 'జూ'లో జంతువుల్లా చూడడం మాకు నచ్చలేదు" అని టీమ్ఇండియా ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.