భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ప్రస్తుతం తాత్కాలిక విరామంలో ఉన్నాడు. వీలైనప్పుడు క్రికెట్ బ్యాట్ పడుతూ సాధన చేస్తూనే... అప్పుడప్పుడూ పలు క్రీడలు ఆడేస్తున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మహీ.. ఈ ఏడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇస్తాడని సమాచారం. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా తన కూతురు జీవాతో కలిసి మంచు కొండల్లో విహరిస్తున్నాడు.
ప్రస్తుతం ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసా? - dhoni Daughter Ziva Singing
గతేడాది ప్రపంచకప్ తర్వాత నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ... ఈ మధ్య కాలంలో పలు క్రీడలు ఆడుతూ సందడి చేస్తున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మహీ... తాజాగా మంచు కొండల్లో విహరిస్తూ కనిపించాడు.
దేహ్రాదూన్‌లోని మంచు కొండల్లో కుటుంబంతో కలిసి విహరిస్తున్న దృశ్యాలను అభిమానులతో పంచుకున్నాడు మిస్టర్ కూల్. ఇందులో తన కూతురు జీవాతో ఆడుకుంటూ కనిపించాడు. జీవా... ఓ కళాఖండం రూపొందించగా ఆమెకు సాయం చేశాడు. ఆ చిన్నారి పాడుతూ గిటార్ వాయించిన వీడియోను తీసి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
భారత తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన మిస్టర్ కూల్.. టెస్టు ఫార్మాట్‌కు 2014 డిసెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 ప్రపంచకప్ తర్వాత అతడు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందించాలని టీమిండియాకు దూరమైన అతడు.. తర్వాత జరిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లకు అందుబాటులో లేడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం కచ్చితంగా బరిలోకి దిగుతాడని అందరూ భావిస్తున్నారు.