తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో 497/9 వద్ద టీమిండియా డిక్లేర్ - ind vs sa live

సఫారీలతో మూడో టెస్టులో 497/9 వద్ద తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది టీమిండియా. రోహిత్ డబుల్ సెంచరీ, రహానే శతకంతో ఆకట్టుకున్నారు.

భారత్-దక్షిణాఫ్రికా ముడో టెస్టు

By

Published : Oct 20, 2019, 2:54 PM IST

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా అనుహ్య నిర్ణయం తీసుకుంది.తొలి ఇన్నింగ్స్​లో 116.3 ఓవర్లలో 497/9 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. సరిగ్గా అదే సమయానికి టీ విరామం తీసుకున్నారు. భారత జట్టులో ఓపెనర్​ రోహిత్ శర్మ 212 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో రహానే 115, జడేజా 51 పరుగులు చేశారు.

అంతకు ముందు 224/3 తో రెండోరోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన.. ప్రారంభంలో ధాటిగానే ఆడింది. రోహిత్ పెవిలియన్ చేరిన అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లలో జార్జ్ లిండే 4, రబాడా 3, నోర్జే, డేన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details