తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాక్స్​వెల్​ను ఎంపిక చేయకపోవడంపై కోహ్లీ ఆశ్చర్యం! - ఆరోన్​ ఫించ్​

భారత్​లో మూడు వన్డేల పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయింది. ఓపెనర్లు రాణించినా మిడిలార్డర్​లో సరైన ప్రదర్శన చేసే ఆటగాళ్లు కరవయ్యారు. దీనిపై తాజాగా స్పందించాడు ఆ జట్టు కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​. ఫిబ్రవరిలో ఆడనున్న తర్వాతి వన్డే సిరీస్​లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది కంగారూ జట్టు.

Team India Captain Virat Kohli Surprised for Not Picked Glenn Maxwell to India ODI series
మ్యాక్స్​వెల్​ను ఎంపిక చేయకపోవడంపై కోహ్లీ ఆశ్చర్యం...!

By

Published : Jan 21, 2020, 4:14 PM IST

Updated : Feb 17, 2020, 9:12 PM IST

మ్యాక్స్​వెల్.. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్​ క్రికెట్​ అభిమానులకు తెలిసిందే. బాదడం మొదలు పెడితే ఎలాంటి బౌలర్​కయినా చుక్కలే . తాజాగా జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లోనూ అదరగొట్టేస్తున్నాడు. మరి అలాంటి బ్యాట్స్​మన్​ను భారత్​తో సిరీస్​ ముంగిట ఎందుకు ఎంపిక చేయలేదు. ఇదే ప్రతి ఒక్కరి ప్రశ్న. మ్యాక్స్​ను​ ఎంపిక చేయకపోవడం అభిమానులనే కాదు.. టీమిండియా సారథి విరాట్​ కోహ్లీనీ ఆశ్చర్యపర్చిందట.ఆస్ట్రేలియా సారథి ఫించ్​తో మాట్లాడిన కోహ్లీ.. ఇదే విషయాన్ని ప్రస్తావించాడట. గతేడాది భారత్​తో జరిగిన టీ20లో మ్యాక్స్​వెల్ సెంచరీ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడట విరాట్​.

ఇదే కారణం..!

భారత్​తో పోరులో మ్యాక్స్​వెల్ లాంటి హార్డ్​ హిట్టర్​ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా మిడిలార్డర్​ కాస్త బలహీనంగా కనిపించింది. ఆల్​రౌండర్​ మార్కస్​ స్టొయినిస్​ కూడా టీమిండియాతో సిరీస్​కు దూరమయ్యాడు. అయితే వీరిద్దరూ 2019 ప్రపంచకప్​లో దారుణంగా విఫలమయ్యారు. కానీ కొన్ని నెలల విరామం తర్వాత బిగ్​బాష్​లో అడుగుపెట్టిన మ్యాక్స్​వెల్​.. అటు బంతితోనూ, బ్యాట్​తోనూ రాణిస్తున్నాడు. అయితే బిగ్​బాష్​ ముందు నాటికే ఆటగాళ్ల స్థానాలు ఫిక్స్​ చేసినట్లు ఫించ్​ వెల్లడించాడు.

మ్యాక్స్​ ఫామ్​లో లేకపోవడం వల్లే ఆస్టన్​ టర్నర్​ను జట్టులోకి తెచ్చినట్లు చెప్పుకొచ్చాడు ఫించ్. అయితే టర్నర్​ కూడా భారత్​తో సిరీస్​లో విఫలమవడం వల్ల.. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు మ్యాక్స్​ మళ్లీ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫించ్​ మాత్రం అతడికి ప్రస్తుతం టాప్​-7లో చోటు లేదని అభిప్రాయపడుతున్నాడు. ఎంపిక చేసిన స్థానాల్లో మార్పులు జరగవని చెప్పాడు.

Last Updated : Feb 17, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details