పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వన్డే కప్ సిరీస్‌లో విక్టోరియా X తస్మానియా జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో... విక్టోరియా జట్టు ఒక్క పరుగు తేడాతో తస్మానియాపై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా నిర్ణీత 50 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. విల్ సుదర్‌లాండ్ 53 పరుగులు (66 బంతుల్లో; 2ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడం వల్ల ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది.
బంతితో మలుపు...
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తస్మానియా ఓ దశలో 4 వికెట్ల నష్టానికి 172తో విజయానికి చేరువైంది. ఇలాంటి సమయంలో విక్టోరియా జట్టు బౌలర్లు మ్యాచ్‌ను ఊహించని మలుపు తిప్పారు.
38వ ఓవర్‌లో అదే స్కోర్ వద్ద వెబ్‌స్టర్‌ను ఐదో వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు బౌలర్ క్రిస్ ట్రిమెయిన్. తస్మానియా అప్పటికి 11 ఓవర్లలో 14 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ఈ సమయంలో 40వ ఓవర్ వేసిన జాక్సన్ కోల్‌మన్... మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తర్వాతి ఓవర్‌లో క్రిస్ ట్రిమెయిన్ మరో రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా తస్మానియా 184 పరుగులకు ఆలౌటైంది.
విక్టోరియా ఒక్క పరుగు తేడాతో నమ్మశక్యం కాని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. అర్ధశతకంతో పాటు రెండు వికెట్లు తీసిన విల్ సుదర్‌లాండ్(విక్టోరియా)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ఇదీ చదవండి...