తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక సిరీస్​కు బంగ్లా సారథి మొర్తజా దూరం - Tamim Iqbal to Lead Bangladesh in Sri Lanka as Mortaza Ruled Out

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​కు​ బంగ్లాదేశ్​ సారథి మొర్తజా దూరమయ్యాడు. గాయం కారణంగా సిరీస్​ నుంచి తప్పుకున్నాడు.

మొర్తజా

By

Published : Jul 21, 2019, 6:03 AM IST

శ్రీలంకతో వన్డే సిరీస్​కు ముందు బంగ్లాదేశ్​ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సారథి మష్రఫె మొర్తజా గాయం కారణంగా సిరీస్​కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

తమీమ్​కు సారథిగా ఇదే మొదటి వన్డే సిరీస్​. ఇంతకుముందు 2017లో న్యూజిలాండ్​తో ఒక టెస్ట్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు. అప్పటి సారథి ముష్ఫికర్ రహీం గాయం కారణంగా అతడికి ఈ అవకాశం లభించింది.

ప్రపంచకప్​లో అద్భుతంగా రాణించిన షకిబుల్ హసన్, లిటన్ దాస్​ ఈ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్​మెన్ అనమోల్ హక్, స్పిన్నర్ తైజుల్ ఇస్లాంలకు అవకాశం లభించింది.

బంగ్లాదేశ్ జట్టు
తమీమ్ ఇక్బాల్ (సారథి), సౌమ్యా సర్కార్, అనమోల్ హక్, మిథున్, ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా, మొసెడిక్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మన్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లాం, రుబెల్ హసన్, షైఫుద్దీన్, ముస్తఫిజుర్ రెహ్మన్

ఇవీ చూడండి.. అంతర్జాతీయ క్రికెట్​లో ఓవర్​త్రోలపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details