మహిళల బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను ఐదేళ్ల తర్వాత మళ్లీ కైవసం చేసుకుంది సిడ్నీ థండర్. శనివారం నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. 7 వికెట్ల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై నెగ్గింది సిడ్నీ జట్టు. 2015 తర్వాత రెండోసారి మళ్లీ విజేతగా నిలిచింది.
మహిళల బిగ్‌బాష్ లీగ్ విజేత 'సిడ్నీ థండర్'
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది సిడ్నీ థండర్ జట్టు. శనివారం జరిగిన తుది పోరులో మెల్బోర్న్ స్టార్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది.
మొదట బ్యాటింగ్ చేసిన మెగ్ లానింగ్ సారథ్యంలోని మెల్బోర్న్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో బ్రంట్(22), సుథర్లాండ్(20) మినహా అందరూ నిరాశపర్చారు. సిడ్నీ థండర్స్ బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్ (2/12), సామీ జో జాన్స్‌న్(2/11) అదరగొట్టారు. మిగతా బౌలర్లూ తలో వికెట్ తీసుకున్నారు.
తక్కువ లక్ష్యంతోనే బరిలోకి దిగిన సిడ్నీ జట్టు సునాయసంగా గెలిచింది. 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాని ఛేదించింది. హీథర్ నైట్(26*), రచేల్ ట్రెన్మన్(23) రాణించగా.. కెప్టెన్ రచేల్ హైనెస్(21) ఆఖర్లో చెలరేగింది. కీలక వికెట్లు తీసిన ఇస్మాయిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.